సారథి, రామాయంపేట: కేరళ నుంచి మధ్యప్రదేశ్ కు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం నేషనల్ హైవే నం.44పై రామయంపేట స్థానిక పెద్దమ్మ టెంపుల్ వద్ద టైర్ పంచర్ కావడంతో బోల్తాకొట్టింది. అందులో ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.