Breaking News

బీసీసీఐ

టీమిండియా క్రికెటర్లకు ట్రైనింగ్​

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ట్రైనింగ్​పై బీసీసీఐ దృష్టిపెట్టింది. ధర్మశాల లేదా బెంగళూరులోని ఎన్సీఏలో జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే నాలుగు దశల ట్రైనింగ్​ షెడ్యూల్​ను రూపొందించినట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. దీంతో నాలుగు నుంచి ఆరు వారాల్లో క్రికెటర్లు పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తారని చెప్పాడు. ‘చాలా విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వస్తారు. కాబట్టి చాలాఉత్సాహంగా ఉంటారు. అలాంటి సమయంలోనే మనం వాళ్లను సరైన పద్ధతిలో ముందుకు […]

Read More

ఖేల్‌రత్నకు రోహిత్‌

న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించింది. ఓపెనర్ శిఖర్ ధవన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్లను అర్జున పురస్కారాలకు సిఫారసు చేసింది. మహిళల విభాగంలో ఆల్​ రౌండర్​ దీప్తిశర్మ అర్జునకు నామినేట్ అయింది. 2019 వన్డే ప్రపంచకప్​లో రోహిత్ ఐదుసెంచరీలు చేయడంతో బీసీసీఐ ఏకగ్రీవంగా అతని పేరును సిఫారసు చేసింది. ఇక 2018లో స్మృతి మంధనతో పాటు ధవన్ పేరును అర్జునకు ప్రతిపాదించినా అవార్డు […]

Read More

విదేశీ స్టార్లు లేకపోతే ఎలా?

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో విదేశీ స్టార్లు ఆడకపోతే కళ తప్పుతుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఈ లీగ్​కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, అందుకే అందరూ పాల్గొనాలని సూచించాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్​పై ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే అది తొందరపాటే అవుతుంది. భారత్ తయారుచేసిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ ఈ లీగ్. ప్రపంచ క్రికెట్​కే ఇది తలమానికం. క్రికెట్​లో ప్రీమియర్ ఈవెంట్ కూడా. అందుకే విదేశీ క్రికెటర్లు కచ్చితంగా ఉండాల్సిందే. […]

Read More

క్రికెట్ గాడిలో పడుతుంది

కలకత్తా: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయని బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘కరోనాను చూసి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికైతే వైరస్​కు మందుల్లేవ్​. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓ ఆరేడు నెలల్లో వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయి. మనలో అద్భుతమైన నిరోధకశక్తి ఉంది. కాబట్టి అన్నింటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. క్రికెట్ కూడా […]

Read More

భారత్ వర్సెస్​ ఆస్ర్టేలియా

డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్​లో తొలి టెస్ట్ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత భారత్ క్రికెట్ జట్టు అతి పెద్ద టెస్ట్ సిరీస్​కు రెడీ అవుతోంది. డిసెంబర్ 3 నుంచి ఆస్ర్టేలియాలో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇండో–ఆసీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ, క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) విడుదల చేశాయి. నాలుగు టెస్ట్​ల్లో భాగంగా తొలి మ్యాచ్ బ్రిస్బేన్​లో జరగనుంది. ఆసీస్​లో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో నాలుగు మ్యాచ్​లకు నాలుగు వేదికలను […]

Read More

డైలామాలోనే టీ20 ప్రపంచకప్

ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ అంశంపై నేడు ఐసీసీ కీలక సమావేశం జరుగబోతున్నది. మెగా ఈవెంట్ను రద్దు చేస్తారని కొందరు, వాయిదా వేస్తారని మరికొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని ఐసీసీ కొట్టి పారేస్తున్నది. ఇప్పటికే 2021 ఎడిషన్ హక్కులు భారత్ వద్ద ఉండడం, దీనికితోడు పన్ను మినహాయింపు విషయంలో బీసీసీఐ, ఐసీసీకి మధ్య వివాదం ముదరడంతో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని అందరూ ఆతృతగా […]

Read More

ఐపీఎల్ కు అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: ఐపీఎల్ భవిష్యత్ పై సందేహాలు వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్ పై నిర్ణయం ఉంటుంది. వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ నిర్ణయం ఉంటుంది. టోర్నీలు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేం. ప్రస్తుతం […]

Read More

శార్దూల్.. ప్రాక్టీస్ షురూ

ముంబై: లాక్​ డౌన్​తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు శనివారం స్థానిక బోయ్​ సర్​ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దీనికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడో లేదో తెలియదు. లాక్​ డౌన్​ తర్వాత ట్రైనింగ్​ మొదలుపెట్టిన భారత క్రికెటర్ శార్దూల్ కావడం విశేషం. లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్టేడియాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో శార్దూల్.. కొంతమంది దేశవాళీ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ […]

Read More