సారథి, నాగర్కర్నూల్: జిల్లాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహణపై బుధవారం జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ సుధాకర్లాల్ వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. చిన్నారులను గుర్తించి సకాలంలో బీసీజీ టీకాలు వేయాలని సూచించారు. తదుపరి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్ఎంఐఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని అన్నారు. టెలీమెడిసిన్ విధానాన్ని రోగులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో […]