బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించింది. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని విజయబావుటా ఎగరవేశారు. 90,411 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్సీపీకి 1,12,072, బీజేపీకి 21,661, కాంగ్రెస్‌కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్సీపీ హవా ముందు ఇతర పార్టీలు పోటీ ఇవ్వలేకపోయాయి.