Breaking News

బదిలి

కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి

కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం   జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read More