లాహోర్: బంతి మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడం బౌలర్లకు శాపంగా పరిణమిస్తుందని పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. దీనివల్ల బౌలర్లు రోబోలుగా తయారవుతారన్నాడు. బంతి స్వింగ్ కాకపోతే బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం మరింత పెరుగుతుందని వెల్లడించాడు. ‘బంతిపై ఉమ్మి రుద్దకపోతే కష్టమే. ఎందుకంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి చల్లటి ప్రాంతాల్లో బౌలర్లకు అంత త్వరగా చెమటపట్టదు. అప్పుడు దేనిని వాడాలి. నా కెరీర్ మొత్తంలో నేను ఉమ్మి రుద్దే స్వింగ్‌ను రాబట్టాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిని […]