Breaking News

పేలుడు

గనిలో పేలుడు.. నలుగురి దుర్మరణం

సారథి న్యూస్​, గోదావరిఖని: జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఉపరితల గని)-1 లోని ఫేస్-2లో గల బ్లాస్టింగ్ స్పాట్ వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు కార్మికులు బండి ప్రవీణ్ (గోదావరిఖని), రాజేష్( ఖమాన్పూర్), అంజయ్య, రాకేష్ మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు వెంకటేష్, భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More