సారథి న్యూస్, చేవెళ్ల: ఉరుముల, మెరుపులతో భారీవర్షం పడడంతో పిడుగు పడి ఎద్దు మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మొగులయ్య కాడెద్దులను పొలంలో కట్టేశాడు. శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో పిడుగు పాటుకు ఎద్దు చనిపోయింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
సారథి న్యూస్, రామడుగు, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం సాయంత్రం అకాలవర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. అలాగే పిడుగు పాటు వణికించింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీట తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యం సైతం కొట్టుకుపోయింది. పొలాల్లో కోతలకు ఉన్న వరి నేలకొరిగింది. […]
సారథి న్యూస్, దుబ్బాక: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఈనెల 19న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేల్లాపూర్ వార్డులో రైతు మట్ట బుచ్చిరెడ్డి(36) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. బాధిత కుటుంబానికి గురువారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.ఆరులక్షల చెక్కును అందజేశారు.