Breaking News

పాలాభిషేకం

కార్యకర్తలతోకలిసి సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి

నారాయణఖేడ్, సారథి న్యూస్: సీఎం కేసీఆర్​ రైతుల పక్షపాతని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు నిధులు విడుదల చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ అని కొనియాడారు. మంగళవారం తన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కంగ్టి ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ లలిత ఆంజనేయులు, సర్పంచ్ పూజ కృష్ణ ముదిరాజ్ టీఆర్​ఎస్​ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More