సారథి న్యూస్, వరంగల్: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కాల్వల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ బస్సులను పరిశీలించారు. మాస్కులు లేకుండా వచ్చేవారిని బస్సుల్లోకి ఎక్కించుకోకూడదని సూచించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.