సారథి, బిజినేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం జిల్లా వైద్యాశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటాలని కోరారు. మనుషుల మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.కృష్ణయ్య, హెల్త్ సూపర్ వైజర్ […]