సారథి న్యూస్, హైదరాబాద్: మూడు రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అడ్డుగుట్ట డివిజన్ లోని చంద్రబాబు నాయుడు నగర్ కు చెందిన ముప్పు బాధితులను డిప్యూటీ స్పీకర్తిగుళ్ల పద్మారావుగౌడ్పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రకృతి ప్రళయం కారణంగా చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసిందన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.