సారథి న్యూస్, రామాయంపేట: రైతు వేదికలను రైతుశిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గురువారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలో యూరియాను తగ్గించేయాలని సూచించారు. తక్కువ మోతాదులో వాడితే పంటకు నష్టం తగ్గి.. మంచి దిగుబడి వస్తుందన్నారు. అలాగే పంటలకు తెగుళ్లు వస్తే వాటికి సరిపడా మందులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, […]