సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ పంచాయతీ కార్యదర్శితో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన రమాదేవికి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంటి పన్నుల నిర్వహణ, ఇండ్లకు అనుమతుల జారీ, ఇంటి యజమాని పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం తదితర అంశాల గురించి ఆరా […]