సారథిన్యూస్, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నెల 1న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. 10 రోజుల తర్వాత గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు […]