సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని వేడుకలను, పండగలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను కొంతమంది పరిమిత సంఖ్యలో పెద్దల సమక్షంలోనే నిర్వహించారు. రెండు సదరు బోనాలతో జమిడిక చప్పులతో ఊరేగింపుగా దేవాలయం వద్దకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి పారిపోయి పిల్ల, జల్ల, గొడ్డు, గోదా, పాడిపంటలను సల్లంగా చూడమని మొక్కుతూ యాటలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ […]