సామజిక సారథి, రాజోలి : డీజిల్, పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]