సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న […]