సారథి న్యూస్, మహబూబాబాద్: గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. జీవో3 అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. జీవో3 అమలైతే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయపోస్టులను వందశాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం […]
న్యూఢిల్లీ/భువనేశ్వర్: చారిత్రక జగన్నాథ రథయాత్రను ఈ సారి నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూన్ 23 నుంచి ఒడిశాలోని పూరిలో రథయాత్ర ప్రారంభం కావలసి ఉన్నది. కాగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్రను నిలిపివేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రథయాత్రకు అనుమతిస్తే భారీగా ప్రజలు గుమిగూడతారని స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతి వాదించారు. ఇతడి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రథయాత్రను నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూరీ […]