కమలా హారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు వాషింగ్టన్: త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో రాజకీయపక్షాల మధ్య మాటలయుద్ధం శృతిమించుతోంది. డెమోక్రాట్లు అంటేనే ఒంటికాలిపై లేచే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా యూఎస్‌లో ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఇండో-అమెరికన్ కమలా హారిస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలైతే అది అమెరికాకు తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో ప్రజలెవరూ కమలా హారిస్‌ను ఇష్టపడడం లేదన్నారు. నార్త్ కరోలినాలో […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. కమలా హారిస్ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్ 1నాటికి వ్యాక్సిన్ […]
వాషింగ్టన్: హెచ్ – 1 బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఫెడరల్ ఏజెన్సీలు ఫారెన్ వర్కర్స్‌ను నియమించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్ జాబ్ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు పెద్దదెబ్బ కానుంది. […]