Breaking News

టీమిండియా

ఆగస్టు​లో శ్రీలంక టూర్​

ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇంకా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టకపోయినా.. ఆగస్టు​లో శ్రీలంక పర్యటనను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. 3వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కోహ్లీసేన అక్కడ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లంకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలుస్తున్నది. ఎఫ్టీపీ ప్రకారం ఈ సిరీస్​ను జూన్​లో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడతో […]

Read More

కోహ్లీ గొప్ప ఆటగాడు

కరాచీ: సమకాలిన క్రికెట్​లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా… సహచరుల్లో స్ఫూర్తిని నింపే ఆటగాళ్లు లేరని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్​మెన్​ అమీర్ సోహైల్ ప్రశంసలు కురిపించాడు. ఈ విషయంలో తమ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్​తో పోలిక ఉందన్నాడు. ‘ప్రస్తుత తరంలో కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అతని చుట్టూ ఉండే ప్లేయర్లలో చాలా స్ఫూర్తి నింపుతాడు. గొప్ప క్రికెటర్లలో ఉండే గొప్పదనం ఇదే. దిగ్గజాల సరసన చోటు సంపాదించాలంటే ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉండాలి. క్రికెట్​లో […]

Read More

హార్దిక్ ఉండడమే బెటర్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్​కు ఆల్​ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. దీనివల్ల టీమ్​లో సమతూకం వస్తుందన్నాడు. ‘పాండ్యా అదనపు బ్యాట్స్​మెన్​, బౌలర్​గా ఉపయోగపడతాడు. దీనివల్ల భారత్​కు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అదనపు బౌలర్​గా పాండ్యా సేవలు చాలాకీలకం. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలంటే మూడో పేసర్​గా పనికొస్తాడు. అతను ఏడో స్థానంలో బ్యాటింగ్​కు వస్తే పంత్​కు కీపింగ్ బాధ్యతలు అప్పగించవచ్చు. […]

Read More

గంగూలీ ఐసీసీ అధ్యక్షుడైతేనే..

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు.. ఐసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. దాదా అంతర్జాతీయ బాడీ పగ్గాలు చేపడితే చాలామంది క్రికెటర్లకు న్యాయం జరుగుతుందన్నాడు. అత్యున్నత స్థానాన్ని చేపట్టేందుకు గంగూలీకి అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. తనపై పాక్ బోర్డు విధించిన జీవితకాల నిషేధాన్ని కూడా ఐసీసీలో అప్పీల్ చేస్తానన్నాడు. ‘నా విషయంలో దాదా తప్ప మరెవరూ న్యాయం […]

Read More

కెప్టెన్సీ బాధ్యతలు పంచుకోవాలి

ముంబై: క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మతో కలిసి పంచుకోవాలని భారత మాజీవికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. ఏడాది మొత్తం ఒకరే నాయకుడిగా వ్యవహరించడంతో బరువు పెరుగుతుందన్నాడు. ఒక జట్టు.. ఇద్దరు సారథుల అంశంపై మోరె మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. టీమిండియా అన్ని ఫార్మాట్లతో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా కోహ్లీయే కెప్టెన్​గా ఉన్నాడు. తద్వారా ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగడం […]

Read More

సారీ చెప్పిన యువీ

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌పై కులం పేరుతో కామెంట్లు చేసిన మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ శుక్రవారం క్షమాపణ కోరాడు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు. ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న యువీ.. చహల్‌ గురించి మాట్లాడుతూ అతని కులప్రస్తావన తెచ్చాడు. దీనిపై సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. హర్యానాకు చెందిన ఓ అడ్వకేట్‌ యువీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, యువీ ట్విట్టర్‌ […]

Read More
ఏనుగు మరణం బాధిస్తోంది

ఏనుగు మరణం బాధిస్తోంది

న్యూఢిల్లీ: మనుషుల క్రూరమైన చర్యల వల్ల కొన్నిసార్లు విపరీతంగా బాధపడాల్సి వస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళలో జరిగిన ఏనుగు ఘనటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గర్భంతో ఉన్న ఏనుగు మరణం తనను కలిచివేస్తోందన్నాడు. ‘మూగజీవులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలు సరికావు. మనం సాయం చేయకపోయినా.. హానీ మాత్రం చేయొద్దు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కేరళలో జరిగింది సిగ్గుమాలిన చర్య అని రైనా అన్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై […]

Read More
బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

ముంబై: అసలే సుదీర్ఘమైన విరామం… ఆపై విశ్రాంతి వల్ల వచ్చే ఉత్సాహం.. దీనికితోడు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామనే ఆతృత.. ఈ అంశాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెటర్ల కొంప ముంచుతాయని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అందుకే ఆట మొదలయ్యాక బౌలర్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. లేకపోతే గాయాల బెడద తప్పదన్నాడు. ‘క్రికెటర్లు గాయపడకుండా టీమ్ మేనేజ్ మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరంభంలో శిక్షణ స్వల్పస్థాయిలో ఉండేలా ప్రణాళికలు వేయాలి. రోజులు గడిచేకొద్ది […]

Read More