సారథి న్యూస్, అలంపూర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చక స్వాములు అంతా ఐకమత్యానికి మారుపేరుగా నిలవాలని అర్చక సంఘం ఉపాధ్యక్షుడు, అర్చక సంఘం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తిరునగరి నరేంద్రాచార్యులు అన్నారు. సోమవారం అలంపూర్చౌరస్తాలోని మార్కెట్ యార్డులో సంఘం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దేవాదాయశాఖ డీడీఎన్ఎస్త్రీమెన్కమిటీ బాధ్యుడు దిండిగల్ఆనంద్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రాచార్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ఆలయాల అర్చకులు వారి ప్రాంతంలో […]
సారథి న్యూస్, అలంపూర్: ఆలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రం ఆవరణలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్చైర్మన్వెంకటేశ్, కమిషనర్మదన్మోహన్గురువారం ప్రారంభించారు. హరితహారం స్వర్ణహారం కావాలని వారు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో వంద మొక్కల చొప్పున నాటడమే కాకుండా ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల మైదానాల్లో మొక్కలు నాటాలని సంకల్పించారు. అంతకుముందు ప్రభుత్వ జూనియన్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత, జయలక్ష్మి, టీఆర్ఎస్ […]
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్ని క్షేత్రాలు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి […]
అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి.. సారథి న్యూస్, అలంపూర్: అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం లోకకల్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మరి నుంచి దేశప్రజలంతా సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ అర్చకులు వేదపండితులు మహాసంకల్పం చేశారు. దేవీ సప్తశతి పారాయణాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన చండీహోమం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆదేశాల మేరకు భక్తులను […]