సారథిన్యూస్, ఖమ్మం: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జెడ్పీ సమావేశమందిరంలో సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, ఖమ్మం: మధిర నియోజకవర్గం అభివృద్ధిపథంలో కొనసాగుతున్నదని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా మధిర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, మొండితోక జయకర్, బిక్కి ప్రసాద్, రంగిశెట్టి కోటేశ్వరరావు, భరత్ వెంకటరెడ్డి, అరిగే శ్రీను వైవీ అప్పారావు, ఇక్బాల్ కొటారి రాఘవరావు, కనుమూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.