సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు […]
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు… సారథి న్యూస్, వనపర్తి: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం ఆయన వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, తూముకుంట, బొల్లారం, వీపనగండ్ల గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, నోటికి రుమాలు కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సంగినేనిపల్లి గ్రామంలో పేద కుటుంబాలకు […]
నిత్యావసర సరుకుల పంపిణీ సారథి న్యూస్, నాగర్కర్నూల్: లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, మిత్రమండలి సమకూర్చిన నిత్యావసర సరుకులను మరికల్ గ్రామంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పంపిణీ చేశారు. అలాగే ముష్టిపల్లి, నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో సరుకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని దాతలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.