సారథి న్యూస్, మెదక్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మెదక్ జిల్లాకు గడ్డం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డ శ్రీనివాస్ పార్టీలో కార్యకర్తస్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. గతంలో ఉమ్మడి మెదక్ మండలాధ్యక్షుడిగా మూడుసార్లు, మెదక్ ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. పార్టీకి అందించిన సేవలకు […]