సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర […]
సారథి, వేములవాడ: అధికార పార్టీ నాయకుల భూకబ్జాల వ్యవహారాన్ని బయటకు తీస్తున్న జర్నలిస్ట్ రఘును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజానికి విలువ లేకపోతే సామాన్య ప్రజలకు భద్రతే లేకుండా పోతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాచరిక పోకడలు మంచిది కాదని హితవుపలికారు. ప్రజలు అధికార పార్టీల పోకడలను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని […]
సారథి, అచ్చంపేట: ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తున్న తొలి వెలుగు ఛానల్ రిపోర్టర్, యాంకర్ రఘును పోలీసులు గురువారం ఉదయం మల్కాజిగిరిలో కిడ్నాప్ చేసిన ఘటనను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు దశరథం నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలు, భూకబ్జాలను వెలుగులోకి తీసుకొస్తున్న రఘును అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గుర్రంపోడు గిరిజన భూముల ఆక్రమణలపై రాజ్ న్యూస్ రిపోర్టర్ గా కథనాలు అందించాడని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]