సారథి, రామాయంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి నీటిపాలైంది. రెక్కలకష్టం మట్టిలో కలిసిందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజాంపేట గ్రామానికి చెందిన చౌదర్ పల్లి స్వరూప. తనకున్న రెండెకరాల్లో యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసింది. వరి నూర్పిడి చేసి నెలరోజుల క్రితం నిజాంపేట వ్యవసాయ సబ్ మార్కెట్ లో నిజాంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు వడ్లను తీసుకొచ్చింది. ‘మా ఆయన ఆరోగ్యం […]