సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం […]
సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజభూమారెడ్డి గురువారం రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. చొప్పదండి మొట్టమొదటి సర్పంచ్ స్వర్గీయ గుర్రం చిన్నాఎల్లారెడ్డి ట్రస్ట్ వారు వాటిని సమకూర్చారు. పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలను పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కాట్నపల్లి మదన్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, కమిషనర్ అంజయ్య, కొత్తూరి నరేష్, మేనేజర్ ప్రశాంత్, హెల్త్ అసిస్టెంట్ మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: రాష్ట్రంలో స్కూళ్లను వెంటనే తెరవాలని, పిల్లలందరికీ తక్షణమే వ్యాక్సిన్ఇచ్చి వారి భవిష్యత్ దృష్ట్యా ఆన్లైన్ క్లాసులకు స్వస్తి పలకాలని, స్కూళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకొని విద్యాబోధన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్ కోరారు. గురువారం ఆయన చొప్పదండి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఏడాదికిపైగా బోధనకు దూరంగా ఉండటం ద్వారా విద్యార్థులు చదువులో వెనుకబడటంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని అన్నారు. […]
సారథి, చొప్పదండి: చొప్పదండి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బంధారపు అజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్లో ఆఫీసులో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై కేక్ కట్ చేశారు. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీఎం కేసీఆర్ కుడి భుజం మాదిరిగా పనిచేశారని, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ ఆయన ఆలోచన విధానం కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ […]
సారథి, చొప్పదండి: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో బయోపెన్సింగ్ డే కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్ గోరింటాకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ముద్దసాని చిరంజీవి, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శరత్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, వార్డు సభ్యులు ఏ.అరుణ, ఎల్.గౌతమి, సంపత్, ఏ.శ్రీనివాస్, కుమార్, సతీష్, కారోబార్ సలీం, మేటీ రాజేందర్, ఆపరేటర్ సాయికిరణ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్వీ నాయకుడు నరేష్ రావన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేష్ రావణ్ మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ప్రవేశపెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్నీరజాభూంరెడ్డి, 9వార్డు కౌన్సిలర్ కొత్తూరి మహేష్, 10వ వార్డు కౌన్సిలర్ […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి కురుమ యువజన సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మంగళవారం మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ రాజన్నల రాజు, ప్రణీత సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువజన సంఘలు సేవాభావంతో పనిచేయాలని కోరారు. యువజన సంఘం అధ్యక్షుడిగా బండారి అనిల్, ఉపాధ్యక్షుడిగా గుంటి సాగర్, ప్రధాన కార్యదర్శిగా రాజన్నల శేఖర్, సంయుక్త కార్యదర్శిగా భూమల్లా సాగర్, కోశాధికారిగా గుంటి శ్యాంకుమార్, కన్వీనర్ గా ఏముండ్ల రాజ్ కుమార్, కోకన్వీనర్ గా జాతరకొండ […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట రోడ్డుకు నిధులు సమకూర్చి అభివృద్ధి చేసినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గాలన్న చిత్రపటానికి బీజేపీ నాయకులు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెద్ది వీరేశం మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సేవలను గ్రామస్తులు ఎప్పటికీ మరిచిపోరని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జతంగి సురేష్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్, బూత్ అధ్యక్షుడు […]