సామాజిక సారథి, నార్కెట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతిచెందాడు. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయక విగ్రహం ప్రక్కనున్న భక్తుల విశ్రాంతి షెడ్డు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై దేవస్థానం సూపరింటెండెంట్ గుజ్జుల తిరుపతిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.యాదయ్య పేర్కొన్నారు.
సారథిన్యూస్, బిజినేపల్లి: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్ అంజిరెడ్డి హెచ్చరించారు. రెండ్రోజుల నుంచి బిజినేపల్లి సమీపంలోని సాఖ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో ఆయన చెరువును పరిశీలించారు. అక్రమంగా మట్టిని తవ్వి చెరువులు పూడ్చిన వారి వివరాలను సేకరించారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ అధికారులు రమేశ్, ఆర్ఐ అలీబాబా నాయుడు తదితరులు ఉన్నారు.