Breaking News

గౌతమ్

గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​

మహబూబాబాద్: మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ గౌతమ్ గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించి కలెక్టరేట్​ వద్ద మూడు మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఓ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత, మున్సిపల్ సిబ్బంది గురు లింగం, పర్యావరణ సూపర్​వైజర్​ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Read More