సామాజికసారథి, సుల్తానాబాద్ : వినాయక చవితి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ప్రధాన కూడళ్లలో భక్తులు ఏర్పాటు చేసిన మండపాల్లో బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వేదపండితులు సూచించిన శుభముహూర్తానికి భక్తులు ప్రత్యేక పూజలుచేసి గణనాథుడి మండపంలో ప్రతిష్టించారు. అంతకుముందు వినాయకులను కొనుగోలు చేసిన భక్తులు మండపాల వరకు శోభాయాత్ర నిర్వహించారు. దీంతో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులపై సందడి నెలకొంది. దాదాపు అన్నివార్డుల్లో ఏర్పాటుచేసిన మండపాల వల్ల వార్డుల్లో పండగ వాతావరణం నెలకొంది.