సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు హెల్త్ సెంటర్లో క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి క్షయవ్యాధి(టీబీ) నిర్ధారణ కోసం వైద్యాధికారుల బృందం తెమడను సేకరించింది. బాధితులకు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. అనంతరంపై కరోనాపై జాగ్రత్తలను వివరించారు. తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఈశ్వరమ్మ, శరత్ బాబు, రవి, రజినీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.