Breaking News

కౌడిపల్లి

కరెంట్​లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

కరెంట్​ లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్​1 నుంచి ఆన్​లైన్ ​క్లాసెస్ ​చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్​ లేకపోవడం పెద్ద సవాల్​గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ ​కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి […]

Read More
ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కరోనా ప్రభావంతో మార్కెట్లన్నీ బంద్​ ఇదే అదనుగా రేట్లు పెంచిన కూరగాయల వ్యాపారులు సారథి న్యూస్, నర్సాపూర్: ‘వామ్మో.. గీవేం రేట్లు బిడ్డో. ముట్టకుంటే ధరలు మంట మండుతున్నయ్​. ఎట్ల కొనాలే.. ఎట్ల తినాలే..’ ఇది ఓ మహిళ ఆవేదన. ‘జేబు నిండ పైసలు తెస్తేనే గానీ కూరగాయలు సంచి నిండుతలేవ్​.. ఉప్పుపప్పులకే అంత బెడితే ఎట్ల బతకాలే. గీ రేట్లు ఎప్పుడు సూడలే’ ఇది ఓ మధ్యతరగతి ఉద్యోగి ఆందోళన. కరోనా […]

Read More
చెత్తసేకరణపై అవగాహన

చెత్తసేకరణపై అవగాహన

సారథి న్యూస్​, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజీపేట, తిమ్మాపూర్ తో పాటు పలు గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేయడంపై గురువారం మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి శివ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటుకోవాలని సూచించారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త రిక్షాలు చెత్తను వేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరహరి, సీఏలు లావణ్య, […]

Read More

వామ్మో.. ఇన్ని పాములా?

–ఇంటి గోడలో 33 పాములు సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా కౌడిపల్లిలోని కొత్తకాలనీలో ఇట్టబోయిన మల్లమ్మ ఇంట్లో ఓ పాము, 32 పాము పిల్లులు వెలుగు చూడడం కలకలం చెలరేగింది. ఇంట్లో రెండు రోజుల క్రితం ఒకపాము బయటకు రావడంతో ఏమిటా? అని గమనించిన కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటి గోడను కూలగొట్టడంతో ఒక్కసారిగా పాములన్నీ బయటకు వచ్చాయి. వాటిని చంపేశారు. 

Read More
కౌడిపల్లిలో సరుకులు పంపిణీ చేస్తున్న యువకులు

యువత… మేమున్నామని

సారథి న్యూస్, నర్సాపూర్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో యువకులు పంచాయతీ సిబ్బందికి బియ్యం, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, కౌడిపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, సాయిలు, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, బాలింతలు సొసైటీ డైరెక్టర్ సోమరమేష్ గుప్తా, మాజీ సర్పంచ్ సారయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శంకర్ ఉన్నారు.

Read More
రక్తదానం గొప్ప కార్యం

రక్తదానం గొప్ప కార్యం

సారథి న్యూస్, నర్సాపూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెదక్​ డీఎంహెచ్​వో డాక్టర్​ వెంకటేశ్వర్లు అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు కౌడిపల్లి పీహెచ్​లో గురువారం రక్తదానం చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. చాలా మంది గర్భిణులు రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో విజయనిర్మల, పీహెచ్​సీ డాక్టర్ వెంకటస్వామి, శోభన, సర్పంచ్​లు వెంకటేశ్వర్ రెడ్డి, శోభ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Read More