24 మందిపై కేసుల ఎత్తివేత సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్ డీఎస్పీ మోహన్‌కుమార్ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ సబ్ డివిజన్ల పరిధిలో 69 మంది రౌడీషీటర్లను ముఖాముఖిగా పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.మనోహర్ వారి సంబంధిత వివరాలను సేకరించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, జీవనోపాధి, సామాజిక వ్యవహారాలు, […]
పొడు భూముల్లో సాగును అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు కాళ్లావేళ్ల మొక్కినా కనికరించని ఆఫీసర్లు పురుగు మందు తాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నం నాగర్ కర్నూల్జిల్లా ముక్కిడిగుండంలో ఉద్రిక్తత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పోడు భూములు పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం గ్రామంలో పొడు రైతులు భూములు పంటలను సాగుచేసుకుంటుండగా బుధవారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, […]
44మంది విద్యార్థినులకు అస్వస్థత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సాంఘిక శాఖ సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం స్కూలులో బ్రేక్ పాస్ట్ లో పులిహోర తిన్న విద్యార్థినులు టిఫిన్ చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఇటీవల కన్నుమూసిన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన సీనియర్ న్యాయవాది బాలీశ్వరయ్య కుటుంబాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నరసింహరెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాలీశ్వరయ్య న్యాయవాద వృత్తికి చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 50ఏళ్ల పాటు న్యాయరంగానికి ఆయన అందించిన సేవలు ప్రజలకు గుర్తుండిపోతాయన్నారు. న్యాయవాద వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడని స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీశ్వరయ్య […]
సారథి, కోడేరు(కొల్లాపూర్): కోడేరు మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో విషజ్వరాల బారినపడిన ప్రతిఒక్కరినీ ఇంటింటికి తిరిగి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాలనీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు. అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. అలాగే రైతుబీమా వచ్చేలా చూస్తామని హామీ […]
సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా […]
సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల కృష్ణానది తీర ప్రాంతాలను సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై బాలవెంకటరమణ, సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. సోమశిల కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున బోటింగ్ చేయడం, చేపలవేటకు వెళ్లడం, పర్యాటకులు నది నీటిలోకి దిగడం వంటి పనులు చేయకూడదని సూచించారు. ఈ సూచనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని […]
సారథి, కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేర్ మండలం నర్సాయిపల్లి శివారులోని 30 ఎకరాల పోడు భూముల్లో ఫారెస్ట్‌అధికారులు మొక్కలు నాటుతుండగా సర్పంచ్ సత్యనారాయణ యాదవ్, రైతులు, ఇతర గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దళితుల భూముల్లో మొక్కలు నాటొద్దని అడ్డుతగిలారు. సర్వేనం.357లో దళితులకు సంబంధించిన 30 ఎకరాల భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ఏమిటని నిలదీశారు. ఫారెస్ట్ భూమి అయితే రికార్డుల్లో చూపించాలని వారు డిమాండ్ చేశారు. ‘మేము చదువుకోలేక భూముల గురించి […]