మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి కుమారుడు, రాంచరణ్ నిర్మిస్తున్నారు. కొణిదేల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ మూవీ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రం తెరకెక్కుతున్నది. అయితే శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.