న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేజ్రీవాల్‌కు రేపు కరోనా టెస్టులు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయనకు ఒంట్లో సరిగా లేదని కానీ ఎవరికి చెప్పలేదని అధికారులు చెప్పారు. ఆయనకు జ్వరం, గొంతు నొప్పిగా ఉందని, అందుకే నిర్బంధంలోకి వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. […]