సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్‌పేట తహసీల్దార్కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.