సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రగతి భవన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రభావం, పట్టణ ప్రగతి, పబ్లిక్ మరుగుదొడ్లు, హరితహారం మొక్కల పెంపకం తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.