సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]