సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మొదటి కరోనా మరణం జరగడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శవాన్ని పూడ్చి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ పీపీఈ కిట్టు ధరించి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తో పాటు మరో నలుగురు యువకులు సర్పంచ్ […]