సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ […]