సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది పుల్కల్ మండలం చౌటకూర్, శివంపేట గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయంటూ రైతులను ఆరా తీశారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకుని రసీదులు ఇవ్వాలని మిల్లర్లకు […]