సారథి, వేములవాడ: కరోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిపై అవగాహన లేక, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుగానే కొవిడ్ వ్యాక్సిన్తీసుకునే ప్రాణాపాయం నుంచి కొంత బయటపడొచ్చని డాక్టర్లు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ కింద సూచించిన సైట్అడ్రస్లో పేరు, వయస్సు, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదుచేసి సూచించిన తేదీలో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్నారు. టీకాల తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని గుర్తుచేశారు. మంత్రితో భారత్బయోటెక్ఎండీ డాక్టర్కృష్ణా […]