సారథిన్యూస్, రామడుగు: బీఎస్ఎం ఆర్ -736 రకం కంది సాగుచేసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ సహాయక సంచాలకులు జే రామారావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెలిచాలలో గాదె నర్సయ్య కు చెందిన కంది పంటను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, విస్తరణ అధికారి గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు.