సారథి, కోడేరు: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం నూతన తహసిల్దార్ గా అంబటి రజిత గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన పనిచేసిన సరిత హైదరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ కి బదిలీపై వెళ్లారు.