సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో మూడురోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీవర్షానికి హైదరాబాద్మహానగరం తడిసిముద్దయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, బేగంపేట, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఆబిడ్స్, […]
సారథిన్యూస్, హైదరాబాద్; ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, […]