Breaking News

ఈదురుగాలులు

గాలివాన బీభత్సం

సారథి న్యూస్, హుస్నాబాద్: గాలివాన బీభత్సంతో లక్షలాది విలువైన కోళ్ల ఫామ్ పూర్తిగా దెబ్బతిన్నది. సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గుడాటిపల్లి, తెలునుగుపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి రేకులు పగిలిపోయాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని బాధితులు బోయిని ఎల్లయ్య, బోయిని సుమలత ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Read More
‘ఎంఫాన్​’‌.. దూసుకొచ్చేన్​

‘ఎంఫాన్​’‌.. దూసుకొచ్చేన్​

బంగాళాఖాతంలో సూపర్‌ సైక్లోన్‌ గా తుఫాన్​ ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు అలర్ట్​ సాయంత్రం ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష  దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎంఫాన్ అతి తీవ్ర తుఫాన్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీలు, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్​ సోమవారం సాయంత్రానికి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుఫాన్​ తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. […]

Read More

సిటీలో వర్షం

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, మారేడ్‌పల్లి, జేబీఎస్‌, బేగంపేట, లంగర్‌హౌస్‌, గోల్కొండ, టోలీచౌకి, కార్వాన్‌, మెహిదీపట్నం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, షాపూర్‌నగర్‌, కూకట్‌పల్లి, కొంపల్లి, సుచిత్ర, చింతల్‌, దుండిగల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, గండిపేట్‌, కిస్మత్‌పూర్‌, బండ్లగూడ జాగీర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ నిలిచిన ప్రాంతాల్లో […]

Read More