సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]