సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పున: ప్రతిష్టాపన సహిత ధ్వజ నవగ్రహ, శిఖర యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతిపూజ, పుణ్యహవాచనం, పంచగవ్య మేళనంతో పాటు నవగ్రహవిగ్రహాలను ఊరేగింపుగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం అగ్ని త్రిష్ట, కుండసంస్కారం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పొనుగోటి భాస్కర్రావు, […]