అరటిపండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అరటిలో ఎన్నో రకాలున్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి.. వీటిలో ఏవీ తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్తి సమస్య పోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ చెప్తుంటారు పెద్దలు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై […]